బీజేపీ, క‌విత మ‌ధ్య గేమ్ మొద‌లైందా..?

తెలంగాణ‌లో ప‌ట్టుసాధించేందుకు బీజేపీ నేత‌లు ప‌క్కా వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు.ముఖ్యంగా సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌లో.పాగా వేసేందుకు బీజేపీ అగ్ర నేత‌లు రంగంలోకి దిగుతున్నారు.

బీజేపీకి ముందుగా ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల నుంచి క్ర‌మ‌క్ర‌మంగా బ‌లోపేతం చేసేందుకు.సాక్షాత్తూ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు నితిన్ గ‌డ్క‌రీ రంగంలోకి దిగారు.

ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటంటే.వారి వ్యూహాల‌ను ముందే ప‌సిగ‌ట్టిన క‌విత‌.

Advertisement

వారికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఢిల్లీలో యాక్టివ్‌గా ఉంటూనే నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అంతే చురుకుగా ఉంటున్నారు.అయితే ఆమె నియోజక‌వ‌ర్గంపై బీజేపీ పూర్తిగా దృష్టిసారించింది.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి కొంత సానుభూతి ఉంది.క్యాడరూ ఉంది.

ఇదే అదనుగా ఈసారి నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితులలో చేజార్చుకోకూడదన్న గట్టి నిర్ణయానికి బీజేపీ వచ్చింది.దేశవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన స్థానాలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

హైదరాబాద్‌లో పాగా వేసే బరువు బాధ్యతలను ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌షా భుజానకెత్తుకున్నారు.ఇక పార్టీలో మరో కీలకమైన వ్యక్తి.

Advertisement

గతంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్‌ గడ్కరికి నిజామాబాద్‌ బాధ్యతలను అప్పగించారు.మహారాష్ట్ర బోర్డర్‌లో ఉండే నిజామాబాద్‌తో గడ్కరికి అనుబంధం ఉంది.2009 ఎన్నికలలో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు.మొన్నటి ఎన్నికల్లో 21.79 ఓట్ల శాతంతో మూడో స్థానం దక్కించుకున్నారు.ఈ లోక్‌సభ పరిధిలో సీరియస్‌గా ఎఫర్ట్‌ పెడితే ఫలితాలు ఉంటాయని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందట! ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండటంతో మాజీ ఎమ్మెల్యేలను.

కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందట! బీజేపీ అగ్రనేతల వ్యూహాల‌ను ముందే గ్ర‌హించిన కవిత అల‌ర్టయ్యారట! నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఒక్క జగిత్యాల మినహా అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు.ఆపరేషన్ జగిత్యాల పేరుతో రిపేర్‌ చేసే పనిలో పడ్డారు.

ఎక్కువ శాతం అక్కడే గడిపేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు.ఇక మొన్న తన అన్న కేటీఆర్‌తో ఆర్మూర్‌లో భారీ సభ నిర్వహించి సక్సెస్‌ అయ్యారు.

ఈ సభ విజయవంతం కావడంతో 17న జగిత్యాలలో భారీ సభను నిర్వహించే పనిలో పడ్డారు కవిత.ఎట్టి పరిస్థితులలో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట.

మొత్తానికి బీజేపీ, క‌విత మ‌ధ్య గేమ్ మొద‌లైంద‌నే చెప్పాలి.

తాజా వార్తలు