తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉన్న పరిస్థితి ఉంది.గమ్యం ఏటో గమనం ఏంటో తెలియక క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే నాయకుడు లేక క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే పార్టీ ప్రతిష్ట గురించి కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట గురించి అంతర్గత విభేదాలతో పార్టీని మరింత దిగజార్చిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే పీసీసీ అధ్యక్షులపై ఊహాగానాలు నడుస్తున్న వేళ ఇంకా హైకమాండ్ నాన్చుతున్న వేళ కాంగ్రెస్ బలహీన పడడంతో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది.
హుజు రాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారంలో కేటీఆర్ ను కలవడంతో పెద్ద దుమారమే రేగింది.

అయితే ఈ విషయంపై కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి వివరణ కోరినప్పటికీ కౌశిక్ రెడ్డి కేటీఆర్ తో సంభాషిస్తున్న ఫోటో టీఆర్ఎస్ లో చేరికకు అర్థం వచ్చేలా ఉండడంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఏది ఏమైనా కాంగ్రెస్ తో టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి కాంగ్రెస్ ఎప్పుడు మేల్కొని పరిస్థితులను రాజకీయంగా లాభం చేకూర్చుకునేలా చక్కదిద్దుకుంటుందనేది చూడాల్సి ఉంది.