అయోమయంలో టీఆర్ఎస్.. ముందస్తుకా.. మునుగోడు బైపోల్ బరిలోకా..?

తెలంగాణలో మరోసారి ఉపఎన్నికల వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కానీ, ఆ రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని తెలుస్తోంది.

దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారా.? లేదా.? అనేది ఉత్కంఠగా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.ఒకవేళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే ఆరునెలలలోపు ఎన్నికల సంఘం తప్పకుండా అక్కడ ఎన్నికలు నిర్వహించి తీరుతుంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెరుకు సుధాకర్‌ను ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటించగా.బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉలుకుపలుకు లేకుండా ఉండిపోయింది.

Advertisement

టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క నాగార్జున సాగర్ మినహా అన్నింటినీ (దుబ్బాక, హుజురాబాద్)ను బీజేపీ ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ టీఆర్ఎస్‌కు టఫ్ ఫైట్ ఇచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో తమకు ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది.

తాజాగా దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు.

ఇప్పుడు గనుక మునుగోడు ఉపఎన్నిక జరిగితే అందులో బీజేపీ నెగ్గితే టీఆర్ఎస్‌కు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ వెళ్లి సభ పెట్టి.దళిత బంధు ప్రకటించి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వందల కోట్లు ఖర్చుపెట్టినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు.ఈ గాయం నుంచి ఇంకా కోలుకోక ముందే మరోసారి మునుగోడు ఉపఎన్నిక రానుంది.

Advertisement

ఇందులో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం.

అందుకోసమే ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవడం లేదని సమాచారం.పురపాలక మంత్రి కేటీఆర్ మునుగోడు ఉపఎన్నిక సాధారణమే దానిని మేము సీరియస్‌గా తీసుకోవడం లేదని హింట్ ఇచ్చారు.ఇక కాంగ్రెస్‌కు మునుగోడులో గట్టి పట్టున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా పవర్ ఫుల్.

వారు రంగంలోకి దిగితే ఓటర్లు ఎలాగైనా వారికే మద్దతిస్తారని నమ్మకంతో బీజేపీ ఉంది.అయితే, మునుగోడు ఉపఎన్నిక ఫలితం ముందస్తు పై పడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ ఈ బైపోల్‌లో పోటీ చేయాలా వద్దా అని అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నాటీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.మునుగోడు టికెట్ కోసం చాలా మంది ఆశావహులు ఎదరుచూస్తున్నట్టు సమాచారం.ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా? నేరుగా ముందస్తుకే వెళ్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు