పెళ్లికి ముందే అత్తారింట్లో ఆ పని చేసిన జోర్దార్ సుజాత.. ఏమైందంటే?

జోర్దార్ వార్తలు అనే ప్రోగ్రామ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో జోర్దార్ సుజాత ఒకరనే సంగతి తెలిసిందే.తెలంగాణ యాసలో చక్కగా మాట్లాడే సుజాతకు ఆ యాస వల్లే ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కడం గమనార్హం.

 Rocking Rakesh Sujatha Varalaxmi Pooja Video Goes Viral In Social Media,rocking-TeluguStop.com

ప్రస్తుతం రాకేష్ తో కలిసి జోర్దార్ సుజాత జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తుండగా ఆ స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సుజాత రాకింగ్ రాకేశ్ తో ప్రేమలో ఉండగా జబర్దస్త్ షో ద్వారానే ప్రేమలో ఉన్న విషయాన్ని రాకేశ్, సుజాత వెల్లడించారనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే వీళ్లద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని పలు వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.తాజాగా సుజాత రాకేశ్ వాళ్ల ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేశానని వెల్లడించారు.వరలక్ష్మీ వ్రతం గురించి సుజాత చెబుతూ పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని ఈ వ్రతం చేస్తారని తెలిపారు.

పెళ్లైన అమ్మాయిలు మాత్రం భర్త బాగుండాలని ఈ వ్రతం చేస్తారని జోర్దార్ సుజాత చెప్పుకొచ్చారు.కాబోయే అత్తగారింట్లో సుజాత వ్రతం చేయడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.అత్తయ్యతో కలిసి సుజాత పూజలో పాల్గొన్నారు.

తాను గతంలో ఎప్పుడూ ఇంత గ్రాండ్ గా వరలక్ష్మీ వ్రతం జరుపుకోలేదని సుజాత కామెంట్లు చేశారు.సుజాత షేర్ చేసిన యూట్యూబ్ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.రాకేశ్ సుజాత జోడీకి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.వీళ్లిద్దరూ కలకాలం అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.రాకేశ్ సుజాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్న రాకేష్ సుజాత జోడీని అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube