గొంతు నొప్పి తో ఇబ్బంది పడుతున్నారా..?! ఉపశమనం కోసం ఇలా ట్రై చేయండి..!

కొంత మందికి సీజన్ మారిన సమయంలో గొంతు నొప్పితో బాధ పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది.

గొంతు నొప్పితో బాధపడే సమయంలో ఇంట్లో ఉండే సహజ పద్ధతిలోనే ఇట్టే నయం చేసుకోవచ్చు.అందుకు చిన్న చిట్కాలు పాటిస్తే సరి.అవి ఏంటో ఒకసారి చూద్దామా.ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కాస్త అల్లం ముక్కలు వేయాలి.

అల్లం ముక్కలు బాగా మరిగిన అనంతరం ఆ  నీటిని  వడకట్టి తాగితే గొంతు నొప్పి నుంచి ఇట్లే బయటపడవచ్చు.అలాగే ఇంట్లో లభించే లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క ,అల్లం లాంటి పదార్థాలను ఉపయోగించి టి తయారు చేసుకొని వేడి వేడిగా తాగితే సరి గొంతు నొప్పి ఇట్లే మటుమాయం అయిపోతుంది.

అంతేకాకుండా ఎవరైనా చికెన్ తినే వారు ఉంటె గొంతు నొప్పి ఇన్ఫెక్షన్ నుంచి బయట పడాలంటే వేడివేడిగా ఉన్న చికెన్ సూప్ తాగితే గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.ఈ సమస్యకు చికెన్ సూప్ ఒక ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

Advertisement

అలాగే గోరు వెచ్చని నీటిలో  కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే సరి.ఇందులో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలు వల్ల గొంతునొప్పిని సులువుగా తగ్గిస్తాయి.లేకపోతె మిరియాలతో తయారు చేసిన చారు, లేదా పాలలో కాస్త మిరియాలు వేసి తీసుకుంటే సరి గొంతునొప్పి నుంచి ఇట్లే  బయటపడవచ్చు.

మిరియాల పాలు  తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా సులువుగా తగ్గిపోతాయి.గొంతు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా మంచిది అవి ఏమిటంటే.

గొంతు నొప్పితో బాధపడేవారు పెరుగు తినకుండా ఉండడం చాలా మంచిది.దగ్గు, గొంతు నొప్పి ఉన్న సమయంలో పెరుగు తీసుకుంటే ఆ వ్యాధి మరింత ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక దూరంగా ఉండాలి.

అంతేకాకుండా గొంతు నొప్పితో బాధపడుతున్న సమయంలో చీజ్ వంటి ఫుడ్ తిసుకోకుండా ఉండటం చాలా మంచిది.అలాగే సి విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మ, ఉసిరి, ఆరెంజ్, నూనెలో వేయించిన పదార్థాలు కొన్ని రోజులపాటు తినకుండా ఉంటే గొంతు నొప్పి సమస్య నుంచి  బయటపడవచ్చు.

చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు