భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుని
పూజా హెగ్డే
వార్తల్లో నిలుస్తున్నారు.ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలలో పూజా హెగ్డే నటించిన సినిమాలే మూడు ఉండటం గమనార్హం.
మే నెలలో పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కానుండగా జూన్ నెలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జులైలో రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.
ఈ మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు హిట్టైనా పూజా హెగ్డే మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.ఆచార్య సినిమాలో పూజా హెగ్డే నీలాంబరి అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు.సిల్వర్ స్క్రీన్ పై గ్లామరస్ గా కనిపించే పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![Telugu Hot, Pooja Hegde-Movie Telugu Hot, Pooja Hegde-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/04/Goes-Viral-hot-photos-Pooja-Hegde-Social-Media-tollywood.jpg)
ఒకవైపు హోమ్లీ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తూ పూజా హెగ్డే అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.రెమ్యునరేషన్ విషయంలో కూడా పూజా హెగ్డే అస్సలు తగ్గడం లేదు.ఒక్కో సినిమాకు ఈ హీరోయిన్ మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది.
పూజా హెగ్డే కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.త్రివిక్రమ్ తరువాత సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తోంది.
హీరోయిన్లను రిపీట్ చేయడానికి ఆసక్తి చూపే త్రివిక్రమ్ పూజా హెగ్డేకు వరుసగా సినిమా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.