కనీసం తిండి పెట్టలేదు.. ప్రాణాలు ఇస్తుందా.. పోకిరి సినిమాపై ఇప్పుడు ట్రోల్స్!

2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పోకిరి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.మహేష్ బాబు, ఇలియానా కలిసి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుకెక్కింది.

 Trolls On Mahesh Babu Pokiri Movie Trolls Know Details, Pokiri Movie Memes, Pok-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ వంటి పలువురు నటీ నటులు నటించారు.

ఈ సినిమాలోని డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఇందులో పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో ఇతర భాషలలో కూడా రీమేక్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

ఇప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉనప్పటి నుంచి మీమర్స్ ఎప్పుడెప్పుడు ఎవర్ని ట్రోల్ చేద్దామా అని ఎదురు చూస్తుంటారు.ముఖ్యంగా సెలబ్రెటీలను మాత్రం అస్సలు వదలరు.

హీరో హీరోయిన్ ల మధ్య ఏదైనా తేడా కనిపిస్తే చాలు వెంటనే ట్రోల్ చేసేస్తారు.అలా ఇప్పటికీ చాలా మంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్స్ చేస్తారు.

పైగా కొన్నిసార్లు కమెడియన్లను కూడా మధ్యలోకి లాగుతూ ఉంటారు.

చాలా వరకు మీమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.

నిత్యం ఏదోక మీమ్ తో బాగా ట్రోల్ చేస్తుంటారు.ఇప్పటికే ఎన్నో మీమ్స్ బాగా వచ్చాయి.

ముఖ్యంగా సినిమాల గురించి, నటినటుల గురించి బాగా వచ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా పోకిరి సినిమా గురించి ఇప్పుడు ఒక ట్రోల్ బాగా వైరల్ అవుతున్నాయి.

ఆ సినిమాలో చూడొద్దు అంటున్నా అనే పాట ఎంత హిట్ అయ్యిందో చూసాం.

ఇక ఈ పాట మధ్యలో నీ కన్నా విలువైనది నాకేది లేదంటా.

నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా అనే లైన్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు.దీంతో మీమర్స్ ఒక మీమ్ క్రియేట్ చేయగా అది అందులో బాగా వైరల్ అవుతుంది.

ఇంతకీ అదేంటంటే.ఇలియానా ఆ సినిమాలో ఉప్మా బాక్స్ తెచ్చుకొని మహేష్ బాబుకు పెడుతుంది.

అలా ఈ మీమ్ లో కనీసం ఉప్మా అడిగితే ఇవ్వలేదు కానీ ప్రాణాలు ఇస్తాదంట ప్రాణాలు.అంటూ వెటకారంగా మీమ్ క్రియేట్ చేశారు.దీంతో ఈ మీమ్ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.అంతే కాకుండా భలే క్రియేట్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అలా మీమర్స్ ఏదోక లాజిక్ తో ముందుకు వచ్చి సోషల్ మీడియా ప్రియులను తెగ నవ్విస్తారు.ఇక మొత్తానికి ఆ మీమ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube