తెలుగు సినిమాలపై సెటైర్లు వేస్తున్న మలయాళీలు...

తెలుగు సినిమా( Tollywood ) అంటే ఒకప్పుడు రొటీన్ సినిమాలు తీస్తారు అనే ఒక అపవాదు అయితే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా అంటే ఇండియా లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తో పాటు చాలా మంచి స్టోరీస్ అన్ని కూడా తెలుగు నుంచే వస్తున్నాయి అని ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం అనుకునేలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదిగింది…అందుకే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల దృష్టి ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది.ఒకప్పుడు తక్కువగా చూసిన టాలీవుడ్ ఇప్పుడు అంతర్జాతీయంగాను సత్తా చాటింది.

 Trolling On Tollywood By Trishanku Malayalam Movie Details, Trolling ,tollywood-TeluguStop.com

గత ఏడాది జక్కన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా( RRR ) సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటింది…

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డ్( Oscar Award ) వచ్చిన విషయం తెలిసిందే.అలాంటి తెలుగు సినిమాల పై మాలీవుడ్ సినిమాలలో సెటైర్ వేస్తున్నారు.

 Trolling On Tollywood By Trishanku Malayalam Movie Details, Trolling ,tollywood-TeluguStop.com

అలాంటి ఒక సీన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…

Telugu Malayalam, Mollywood, Oscar Award, Ram Charan, Ss Rajamouli, Telugu Cine,

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు.కానీ టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) తెరకెక్కించిన బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగింది.ఆ తరువాత వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు క్రేజ్ ఏర్పడింది.

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వంటి డైరెక్టర్ ప్రశంసలు కురిపించాడు అంటే తెలుగు సినిమా ఖ్యాతి గురించి అర్ధం చేసుకోవచ్చు.జక్కన్న నెక్స్ట్ సినిమా కోసం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు…

Telugu Malayalam, Mollywood, Oscar Award, Ram Charan, Ss Rajamouli, Telugu Cine,

అయితే ఒక మలయాళ సినిమాలో టాలీవుడ్ పై సెటైర్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.‘త్రిశంకు’ అనే మలయాళ మూవీలో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు.అపుడు హీరోయిన్ వల్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు ఏమో అంటుంది.

అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సినిమాలలో లాగా లేచిపో అని చెప్తుంది.నిజానికి అన్ని తెలుగు సినిమాలూ అలా ఉండవు.

కానీ ఈ సినిమాలో ఆ పదం వాడేసారు.ఈ వీడియో చూసిన కొంత మంది తెలుగువాళ్ళు మా సినిమాలు అన్నీ అలా ఉండవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube