ఎన్టీఆర్ కోసం పక్కా ప్లాన్ వేస్తోన్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ఈ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుండగా, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా పూర్తికాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలంటే తారక్ ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగించుకోవాలి.కానీ పలు కారణాల వల్ల ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి కాలేదు.

Advertisement

దీంతో త్రివిక్రమ్ చాలా రోజులుగా తారక్ కోసం ఎదురుచూస్తూ వస్తున్నాడు.అయితే ఆర్ఆర్ఆర్ ముగిసే సరికి చాలా సమయం పడుతుందనే కారణంగా, త్రివిక్రమ్ ఈలోపు ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తాడనే వార్త ఫిలింనగర్ వర్గాల్లో బాగా వినిపించింది.

కానీ అవేవీ నిజాలు కావని తెలుస్తోంది.ప్రస్తుతం త్రివిక్రమ్ కేవలం తారక్‌తో చేయబోయే సినిమాపైనే ఫోకస్ పెట్టాడని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో పట్టాలెక్కించడం ఖాయమని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.అటు తారక్ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను అప్పటికల్లా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో ఫిబ్రవరిలో ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మాటల మాంత్రికుడితో పాటు తారక్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!

మరి ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా, ఈ సినిమాకు టైటిల్ ఏమిటా అనే అంశాలు తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు