టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ని మాటల మాంత్రికుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.
త్రివిక్రమ్ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కామెడీ డైలాగ్స్ కామెడీ కి కొదవ ఉండదు అని చెప్పవచ్చు.
ఎమోషనల్ సన్నివేశాలను, కామెడీ సన్నివేశాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ కు త్రివిక్రమే సాటి అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రస్తుతం శ్రీనివాస్ హీరో మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక లగ్జరీ కార్ ని కొనుగోలు చేశాడు.
మరి ఆ కారు ధర పూర్తి వివరాలు వస్తే.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఫోటోలో కనిపిస్తున్న కార్ కలర్ ని బట్టి అది బిఎండబ్ల్యూ 7సిరీస్ 740 లీటర్స్ మోడల్ కారుగా అంచనావేస్తున్నారు.సాధారణంగా మార్కెట్లో ఆ కారు ధర రూ.1.34 కోట్లు కాగా త్రివిక్రమ్ కొనుగోలు చేసిన ఆ లగ్జరీ కారు ధర రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ వార్త విన్న పలువులు నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో కలిసి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆ సినిమాకు కాస్త బ్రేక్ పడింది.అయితే ఇటీవలే కృష్ణకు సంబంధించిన పెద్దకర్మ పూర్తవడంతో కొద్దిరోజుల సమయం తీసుకొని మహేష్ బాబు మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తికాక రెండవ షెడ్యూల్లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.








