పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.పవన్ ను మాస్ అవతార్ లో చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ తో పవర్ ప్యాక్డ్ ట్రీట్ ఇచ్చాడు.
దీంతో ఈ సినిమా కోసం థియేటర్ ల వద్ద ఫ్యాన్స్ పూనకాలు స్టార్ట్ అయ్యాయి.
మునుపెన్నడూ లేని విధంగా పవన్ మాసీవ్ పాత్రలో నటించడంతో థియేటర్ ల దగ్గర రచ్చ మొదలయ్యింది.
ఫ్యాన్స్ చేస్తున్న పూనకాలతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న థియేటర్స్ అన్ని కూడా దద్దరిల్లి పోతున్నాయి.భీమ్లా నాయక్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ రోజు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సాగర్, త్రివిక్రమ్, థమన్, రామజోగయ్య శాస్త్రి, సంయుక్త మీనన్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడారు.ఈయన మాట్లాడుతూ.80, 90 లలో నటీమణుల కంటే ఈ యంగ్ జెనెరేషన్ బాగా ఎదిగి పోయారని స్టేట్ మెంట్ ఇచ్చేసారు.అయితే వెంటనే ఈ స్టేట్ మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగొచ్చని అంటూనే క్షమించమని కోరారు.
”గత ఆరు ఏళ్లగా చూస్తున్నాను.ఈ తరం నటీనటుల డైలాగ్స్, లుక్స్ పరంగానే కాకుండా 24 క్రాఫ్ట్స్ పై కూడా మంచి పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు’ అంటూ ఆయన ఈ జనరేషన్ మీద ప్రశంసలు కురిపించారు.అలాగే మిగతా విషయాలపై కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.