టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయి.
ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు.
అయితే ఈయన దర్శక పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన కథతో మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అవుతుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత జూన్ నుంచి త్రివిక్రమ్ మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇక మహేష్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉండడంతో ఎవరిని తీసుకోవాలని పలువురు హీరోయిన్ల పేర్లను ప్రస్తావించారు.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీలాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సెకండ్ హీరోయిన్ అంటే తన పాత్రకు ప్రాధాన్యత ఉండదని భావించి నో చెప్పారని సమాచారం.అయితే ఎలాగైనా తన సినిమాలో శ్రీ లీలాను హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ ఏకంగా తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ మారుస్తూ తన పాత్రకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలుస్తోంది.మరి తన కోసం త్రివిక్రమ్ నిజంగానే స్క్రిప్ట్ మారుస్తున్నారా? ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.