అనుష్క ఫేవరెట్ అంటున్న త్రిష..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరంటే ఒకరు పడనట్టుగా ఉంటారు.అసలు ఒక హీరోయిన్ ముందు మరో హీరోయిన్ పేరు ప్రస్తావించాలన్నా ఇబ్బంది పడే వారు.

 Trisha Announced Anushka Is Her Favourite Heroine Details, Anushka, Anushka Shet-TeluguStop.com

ఆమె కన్నా నేనే గొప్ప.నా కన్నా ఆమె ఎందులో గొప్ప అన్న టాక్ ఉండేది.

కానీ ఇది ఒకప్పుడు ఇప్పుడు హీరోలే కాదు హీరోయిన్స్ కూడా తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటున్నారు.ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ బాగా చేసిందని అంటే అవును తానైతే అలా చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

ఇదే క్రమంలో సౌత్ స్టార్ హీరోయిన్ రెండు దశాబ్ధాలుగా తన నటనతో ఆకట్టుకుంటున్న త్రిషని తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగితే క్షణం ఆలోచించకుండా అనుష్క అని చెప్పేసింది.అనుష్క అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్పలేదు కానీ ఇష్టమైన హీరోయిన్ అనగానే పెద్దగా ఆలోచించకుండా అనుష్క పేరు చెప్పేసింది త్రిష.

బహుశా ఆమెలా తను అన్ని ప్రయోగాలు చేయలేదనో లేక మరో కారణమో కానీ త్రిష మాత్రం అనుష్క తన ఫేవరెట్ అని ఒప్పేసుకుంది.త్రిష తర్వాత వచ్చినా అనుష్క పై తన అభిమానాన్ని చాటింది త్రిష. ఇదో రకంగా హీరోయిన్స్ మధ్య సత్సంబంధాన్ని తెలియచేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube