వాట్సప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చేసేయొచ్చట... ఎలా అంటే?

సాధారణంగా మనం వాట్సప్‌లో( Whatsapp ) మెసేజ్ చదవాలంటే ఖచ్చితంగా యాప్ ఓపెన్ చేసి తీరాల్సిందే కదా.అయితే యాప్ ఓపెన్ చేయకుండానే వాట్సప్‌లో మెసేజ్ ( Message ) చదవొచ్చనే విషయం మీకు తెలుసా? ఇదెలా సాధ్యం అనే డౌట్ వస్తోంది కదూ.ఇది చాలా సింపుల్ అని కొంతమంది యూజర్స్ చెబుతున్నారు.ఇక దీనికోసం మీరు థర్డ్ పార్టీ యాప్ కూడా డౌన్‌లోడ్ చేయాల్సిన పనే లేదు.

 Trick To Read Whatsapp Messages Without Opening App Details, Technology Updates,-TeluguStop.com

ఏ యాప్ సాయం లేకుండా, మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుండా, మీకు ఏ మెసేజ్ వచ్చినా చదివేయొచ్చట.ఇపుడు అదెలాగో తెలుసుకుందాం.

అయితే చాలామంది నోటిఫికేషన్ ప్యానెల్‌లో వాట్సప్ మెసేజ్ చదవొచ్చని అనుకుంటారు.అది కాదు విషయం.ఎందుకంటే నోటిఫికేషన్ ప్యానెల్‌లో మొత్తం మెసేజ్ అనేది కనిపించదు.ఈ విషయం మీకు తెలిసిందే.ఓ చిన్న ట్రిక్‌తో మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మెసేజ్ మొత్తం చదివేయొచ్చు.మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే ఇక్కడ చెప్పిన ట్రిక్ పనిచేస్తుంది.

ఇందుకోసం మీరు వాట్సప్ విడ్జెట్( Whatsapp Widget ) వాడాల్సి ఉంటుంది.

దీనికోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి.మీకు వచ్చే ఆప్షన్స్‌లో విడ్జెట్స్ ఆప్షన్ ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే వాట్సప్ విడ్జెట్ కనిపిస్తుంది.వాట్సప్ విడ్జెట్ ట్యాప్ చేసి హోమ్ పేజీలో యాడ్ చేస్తే సరిపోతుంది.

ఈ చిన్న మార్పుతో మీరు మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చదివేయొచ్చు.మీకు వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ వస్తే యాప్ ఓపెన్ చేయకుండా విడ్జెట్‌లో చూస్తే సరిపోతుంది.

ఫుల్ మెసేజ్ కనిపిస్తుంది.మీరు చదవని మెసేజెస్ అన్నీ విడ్జెట్‌లో కనిపిస్తాయి.

ఇక వాట్సప్ ఇటీవల రోజుకొక కొత్త కొత్త ఫీచర్స్ విడుదల చేస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube