ట్రెండింగ్ ఐకానిక్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్న 'బేబీ' డైరెక్టర్!

ప్రముఖ రచయిత, దర్శకుడు సాయి రాజేష్( Sai Rajesh )అంటే గత ఏడాది వరకు పెద్దగా పరిచయం లేదు.

కానీ ఈ ఏడాది ఈయన తెరకెక్కించిన మూవీతో ఒక్కసారిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు.

సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ బేబీ.( Baby Movie ) ఈ సినిమా జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.

అంతేకాదు నిర్మాతల జేబులను దండిగా నింపింది.ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ), విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మూవీ బేబీ.పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం అది మనసుకు హత్తుకునేలా ఉండడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.సాయి రాజేష్ సున్నితమైన ప్రేమ కథను యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు.

Advertisement

మరి ఈ సినిమా థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాగా ఆ తర్వాత ఓటిటి ఎంట్రీ ఇచ్చి కూడా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఆ తర్వాత బుల్లితెర మీద కూడా ప్రసారం అవ్వగా అక్కడ కూడా బ్లక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేసిన సేమ్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుండి లభించింది.

మరి అలాంటి సినిమాను తెరకెక్కించిన సాయి రాజేష్( Sai Rajesh ) కు లేటెస్ట్ గా ఒక అవార్డు దక్కింది.తాజాగా జరిగిన ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ట్రేండింగ్ ఐకానిక్ దర్శకుడిగా ఈ యంగ్ డైరెక్టర్ కు అవార్డు దక్కింది.దీంతో బేబీ మూవీ అవార్డ్స్ హంట్ స్టార్ట్ అయినట్టే అని చెప్పాలి.

కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు