ఏపీలో పలు ఐపీఎస్,( IPS ) ఐఏఎస్( IAS ) అధికారులపై బదిలీ వేటు పడింది.ఈ మేరకు ఎన్నికల కమిషన్( Election Commission ) ఆదేశాల మేరకు పలువురు అధికారులను బదిలీ చేశారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులతో పాటు ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది.
ఈ క్రమంలోనే ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్,( SP Parameswar ) పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,( SP Ravishankar Reddy ) చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ బదిలీ అయ్యారు.అదేవిధంగా కృష్ణా జిల్లా డీఈవో పి.రాజాబాబు తో పాటు అనంతపురం జిల్లా డీఈవో ఎం.గౌతమిపై బదిలీ వేటు పడింది.అలాగే తిరుపతి డీఈవో లక్ష్మీషాపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది.