రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

యాదాద్రి భువనగిరి జిల్లా:రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నందీశ్వర్‌ రెడ్డిని నాచారం పోలీస్‌స్టేషన్‌కు, కుషాయి గూడ ట్రాఫిక్‌ 2లో విధులు నిర్వహిస్తున్న వై.

 Transfer Of 14 Inspectors Under Rachakonda , Rachakonda , V. Ashok Reddy, Nandis-TeluguStop.com

రవీందర్‌ ను చర్లపల్లికి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ఎలక్షన్‌ రెడ్డిని ఉప్పల్‌కు, సైబర్‌ క్రైంలో పనిచేస్తున్న బి.రాజును పోచారం ఐటీ కారిడార్‌ స్టేషన్‌కు,భువనగిరి రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనారాయణను మల్కాజిగిరికి బదిలీ చేశారు.ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవిందరెడ్డి ని మేడిపల్లికి, పోచారం ఐటీ కారిడార్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అశోక్‌ రెడ్డిని ఎస్‌ఓటీ 2కు,మంచాల స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎం.కాశీవిశ్వనాథ్‌ ను మీర్‌పేటకు,మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ను సైబర్‌క్రైం ఠాణాకు బదిలీ చేశారు.వెయిటింగ్‌లో ఉన్న పి.ఆంజనేయులును ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌గా, నాచారం ఇన్‌స్పెక్టర్‌ ఎం.ప్రభాకర్‌ రెడ్డిని సైబర్‌ క్రైం స్టేషన్‌కు,మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ పి.సైదులును స్పెషల్‌ బ్రాంచ్‌కు,స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రవికుమార్‌ ను వనస్థలిపురానికి,చర్లపల్లి ఇన్‌స్పెక్టర్‌ వై.మల్లికార్జున్‌ రెడ్డిని సైబర్‌ క్రైం ఠాణాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube