తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి నటి నిషా నూర్( Actress Nisha Noor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆతరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఈమె 1980లో తన గ్లామర్‌తో వెండితెరను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా( Star Heroine ) వెలుగొందింది.
బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్, భారతీరాజా వంటి గొప్పగొప్ప డైరెక్టర్లతో పని చేసింది.రజనీకాంత్, కమల్ హాసన్, భానుచందర్ వంటి బడా స్టార్స్ తో కూడా కలిసి నటించింది.
అలా దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన అందచందాలకు యూత్ దాసోహమైంది.కానీ 1995 తర్వాత నిషా నూర్‌కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.స్టార్‌డమ్ స్టేటస్‌ను అనుభవించిన ఆమె అవకాశాల కోసం తల్లడిల్లింది.అయినా ఏ ఛాన్సూ రాకపోవడంతో సినిమాలు వదిలేసింది.సంపాదించుకున్నదంతా కరిగిపోసాగింది.
బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా అందుకోసం ఆమె వక్రమార్గాన్ని ఎంచుకుంది.వ్యభిచార వృత్తిలోకి( Prostitution ) దిగింది.
ఒక నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారాలు కూడా జరిగాయి.
ఇకపోతే సినీ పరిశ్రమ నుంచి ఆపన్నహస్తం లేకపోవడంతో ఈ వృత్తిలోనే కొనసాగింది.ఒకానొక సమయంలో తలదాచుకోవడానికి చోటు లేక ఒక దర్గా వెలుపల నిద్రించింది.అప్పటికే ఆమె బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది.
నిషా దీన స్థితిని గమనించిన ఒక తమిళ ఎన్జీవో ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్( AIDS ) ఉన్నట్లు తేలింది.
ఎయిడ్స్‌తో పోరాడుతూ 2007లో ఆస్పత్రిలో అనాధలా కన్నుమూసింది నిషా నూర్.
.