ఏలూరు జిల్లా( Eluru )లో విషాదం నెలకొంది.జంగారెడ్డి గూడెంలో పానీపురి తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారని తెలుస్తోంది.
తెల్లవారుజామున వాంతులు, విరోచనాలతో చిన్నారులు చనిపోయారు.అయితే పానీపురి తినడంతో ఫుడ్ పాయిజన్ అయి తమ బిడ్డలు చనిపోయారని ఆరోపిస్తూ బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నంద్యాల జిల్లా( Nandyal district ) రేచెర్ల గ్రామానికి చెందిన చిన్నారుల తండ్రి బతుకుదెరువు కోసం జంగారెడ్డిగూడెంకు వచ్చి నివాసం ఉంటున్నారు.పానీపురి కావాలని అడగడంతో తండ్రి వారికి పానీపురి తినిపించారు.ఆ తరువాత ఇంటికి వచ్చిన చిన్నారులు ఇంటికి వచ్చి పెరుగన్న తిని పడుకున్నారని తెల్లవారుజామున కడుపునొప్పితో బాధపడ్డారని తండ్రి తెలిపారు.ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు బిడ్డలు చనిపోయారని వాపోయారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఫుడ్ సేప్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు.