న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఈ మేరకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు అధికారులు.
రేపు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ రూట్లలో వాహనాలకు అనుమతి లేదు.
అదేవిధంగా జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 వరకు నగరంలోకి భారీ వాహనాలకు అధికారులు అనుమతిని నిరాకరించారు.







