తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.హైదరాబాద్ లో రెండు, మూడు రోజుల్లో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు ఆయన మనసులో మాట అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఇదిగో బీజేపీ నైజం.సంజయ్ మనసులో మాట వినండి.
ఏ కుట్రకు ఈ గుసగుసలు.వీళ్లా నాయకులు.? అని ట్వీట్ లో ప్రశ్నించారు.ఇలాంటి క్రూర సిద్ధాంతాలు గల పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు.







