అమెరికాలో అంగరంగవైభవంగా బతుకమ్మ సబరాలు...!!!

అక్టోబర్ నెలలో దసరాకు రెండు రోజుల ముందు వచ్చే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణాలో కోలాహలంగా ఉంటుంది.

బతుకమ్మలతో , బతుకమ్మ పాటలతో, పూల బుట్టలతో, బంధువులతో, వీధి వీధి, ఊరు ఊరు కోలాహలంగా మారిపోతాయి.

ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా చేయడంతో మరింత ఖ్యాతిని గాంచింది ఈ బతుకమ్మ పండుగ.అయితే కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే కాదు, తెలంగాణా నుంచీ వివిధ దేశాలకు వలసలు వెళ్ళిన వారు సైతం బతుకమ్మ పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటూ, తమ సాంప్రదాయాలను చాటుకుంటున్నారు.

తెలుగు వారు అందులోనూ తెలంగాణాకు చెందిన వారు అమెరికాలో అత్యధికంగా ఉంటారు.అక్కడ వివిధ తెలుగు సంస్థలు బతుకమ్మ పండుగను ప్రతీ ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటాయి.

అమెరికాలోని డల్లాస్ లో ఏర్పడిన తెలుగు పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంది.ప్రతీ ఏటా సంస్థ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను, ఈ ఏడాది కూడా సభ్యులు అందరూ హాజరయ్యి జరుపుకున్నారు.

Advertisement

దాదాపు 500 మంది పాల్గొన్న ఈ వేడుకలు డల్లాస్ లోని రాంచ్ ఇన్ ఆబ్రే లో ఉన్న అతిపెద్ద ఫామ్ హౌస్ లో నిర్వహించారు.అమెరికాలోని కోవిడ్ నిభందనలకు అనుగుణంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నట్లుగా టీపాడ్ నిర్వాహకులు తెలిపారు.

గతంలో అంటే కోవిడ్ కు ముందు దాదాపు 10 వేల మందితో అతిపెద్ద స్టేడియం లో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నామని, ప్రస్తుత నిభంధనల నేపధ్యంలో ఆ స్థాయిలో వేడుకలు జరపడం సాధ్యం కాలేదని కానీ అమెరికాలో పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు సభ్యులను ఎంతో ఆకర్షించాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకలలో భాగంగా సుమారు 14 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేశారు.

మహిళలు అందరూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ సంతోషంగా గడిపారు.కార్యక్రమం ముగించిన తరువాత బతుకమ్మను అక్కడే ఉన్న సరస్సులో నిమజ్జనం చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు