నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం( Penchalakona Waterfalls ) చూడటానికి వచ్చిన 11 మంది పర్యాటకులు మధ్యాహ్నం గల్లంతు కావడం జరిగింది.పెంచలకోనలో విహారయాత్రకు వచ్చి ఎంజాయ్ చేస్తుండగా.
ఒక్కసారిగా వరద ఉధృతకు పర్యాటకులు( Tourists ) కొట్టుకుపోయారు.దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు గల్లంతైన వారికోసం రోప్ ల సాయంతో వెతుకులాట మొదలుపెట్టారు.
ఈ క్రమంలో రెండు మూడు గంటలకు మొత్తం పర్యాటకులు అందరిని రక్షించారు.జలపాతం అందాలు చూడటానికి.
మొత్తం 11 మంది అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు వరద ఉధృతకు.అక్కడే చిక్కుకు పోవడం జరిగింది.
ఈ క్రమంలో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన పర్యాటకులందరినీ సురక్షితంగా కాపాడారు.పోలీసులు… ఫైర్ సిబ్బంది రాత్రి వేళ కూడా రోప్ ల సాయంతో గాలించి.పర్యాటకులందరినీ సురక్షితంగా కాపాడటం జరిగింది.కార్తీక మాసం కావడంతో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు జలపాతం దగ్గర విహారయాత్రకు వెళ్లారు.ఈ క్రమంలో జలపాతంలో ఆహ్లాదంగా స్నానాలు చేస్తుండగా.ఒక్కసారిగా వరద ఉధృతి( Flood Water ) పెరగడంతో స్వాములు కొద్ది దూరం కొట్టుకుపోయారు.
దీంతో సకాలంలో చేరుకుని త్రుటిలో ప్రాణాపాయం నుంచి స్వాములను తప్పించడంతో.పోలీసులు.ఫైర్ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు.