క్రిస్మస్ కు బయటకు తీసుకువెళ్లలేదని కోపం తో ఇల్లు తగులబెట్టిన తాబేలు

ఏంటి తాబేలు ఇల్లు తగులబెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.నిజంగా ఈ ఘటన బ్రిటన్ లోని ఎసెక్స్ లో డ్యూటన్ హిల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

 Tortoise Nearly Burnsdown His Owners House On Chrismas Day-TeluguStop.com

వివరాల్లోకి వెళితే….బ్రిటన్ ల్ని డ్యూటన్ హిల్ ప్రాంతంలో నివసించే ఒకరు తాబేలు ను పెంచుకుంటున్నారా.

అయితే ఇటీవల క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకున్న ఆ కుటుంబం బయటకు వెళ్లాలని అనుకుంది.అనుకున్నదే తడవుగా వారంతా కూడా బయటకు వెళ్లారు.

అయితే ఆ సమయంలో తాబేలు ను మాత్రం ఇంట్లో వదిలేసి ఆ కుటుంబం మొత్తం బయటకు వెళ్లిపోయారు.ఈ క్రమంలో తన యజమాని పై కోపం తెచ్చుకున్న ఆ తాబేలు ఎవరిపై ఆ కోపం చూపించాలో తెలియక పక్కనే ఉన్న లాంతరు ను కాలితో తన్నింది.

ఇక అంతే ఆ లాంతరు నేలకొరిగి ఆ తాబేలు పడక మీదే పడడం అవి కాస్త కొద్దీ క్షణాల్లో ఇతర వస్తువులను తాకడం తో ఇల్లు మొత్తం నిప్పు అంటుకుంది.క్రమంగా ఒక్కో వస్తువునే కబళిస్తూ ఇల్లంతా ఆక్రమించసాగాయి.

దట్టంగా పొగ లేవడంతో ఆ ఇంట్లోని ఫైర్ అలారం కూడా పెద్దగా మోగసాగింది.అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం తో ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే పక్కనే ఉన్న 45 ఏళ్ల ఒక వ్యక్తి ఆ మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం తో హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే ఆ తాబేలు కూడా ప్రాణాలతో క్షేమంగా బయటపడగలిగింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ మేటర్ కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube