అది డ్రగ్ లాంటిది అంటున్న హీరోయిన్

మనకి ఇష్టమైన సినిమాతారలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు .ఇవేవి మనం కనుక్కోనక్కరలేదు.

 Top Actress Compares Social Media With Drug-TeluguStop.com

వాళ్ళే స్వయంగా ఫేస్ బుక్ లో , ట్విట్టర్ లేదా ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసేసి చెప్పేస్తూ ఉంటారు.చిన్న, పెద్ద లేకుండా హీరో,హీరోయిన్లు, దర్శకులు,నిర్మాతలు చివరకి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా సామాజిక వెబ్ సైట్స్ లో తమ ఖాతాలు ఓపెన్ చేసుకుంటున్నారు.

కాని బాలివుడ్ అగ్రనటి కరీనాకపూర్ అదోరకం.

దీపిక రావడం, వయసు పెరగటం, పెళ్లి కావడంతో కాస్త నేమ్మదించినా, బాలివుడ్ ఓ రేంజ్ లో ఏలింది కరీనా.35 ఏళ్ల వయసొచ్చినా, ఇంకా ఈ సుందరి చేతిలో పెద్ద సినిమాలు ఉంటున్నాయి.ఇంకా చెప్పాలంటే ఈ అమ్మడు వద్దనుకున్న సినిమాలు కుర్ర హీరోయిన్లకు వెళుతున్నాయి.

మరి ఇంత క్రేజ్ పెట్టుకొని కూడా కరీనా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి వాడట్లేదు.అలా ఎందుకు అని అడిగితే ” సోషల్ మీడియా అనేది ఒక డ్రగ్ లాంటిది.

మీకు ఓ 5 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేస్తే , పది మిలియన్లు కావలి అనిపిస్తది, ఆ తరువాత పదిహేను.ఇలా ఆశకు హద్దు ఉండదు.నా అభిమానుల్ని బయట ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడుతాను.వాళ్ళకోసం నేను ట్విట్టర్ వాడాల్సిన పని లేదు.

నేనేం సినిమా చేస్తున్నాను , ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఎలాగో మీడియా రాసెస్తుంది.అదికాక ప్రతివిషయాన్ని గమనించాలి, దాని మీద దీని మన అభిప్రాయాన్ని చెప్పాలి.

తేడా కొడితే తిట్లు పడాలి.ఇవన్ని ఎందుకు.

సోషల్ మీడియా టైం వెస్ట్.నాకు ఒక వ్యక్తిగత జీవితం ఉంది.” అంటూ సోషల్ మీడియా మీద విరుచుకుపడింది బెబో.

కరీనా ప్రస్తుతం ఉడ్తా పంజాబ్ తో పాటు కి అండ్ కా అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube