వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.తమ ప్రాముఖ్యత, అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం టర్బో చార్జ్డ్ ఇంజిన్లతో కూడిన కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి.టర్బోచార్జ్డ్ టెక్నాలజీకి అనుకూలంగా ఇంజిన్‌లను తగ్గించడం చాలా ట్రెండ్‌గా మారింది.
టర్బోచార్జ్డ్ ఇంజన్లు( Turbocharged Engines ) పరిమాణంలో చిన్నవి కానీ వాటి నాన్-టర్బో ఇంజిన్ల కంటే ఎక్కువ శక్తివంతమైనవి.త్వరలో మనకు దీపావళి పండగ వస్తోంది.
ఈ తరుణంలో కార్ల కొనుగోలుదారులు తమకు నచ్చిన కారును కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు.ప్రస్తుతం మార్కెట్‌లో రూ.15 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఏవో తెలుసుకుందాం.

ప్రజలు ఎక్కువగా మెచ్చే కార్లలో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్( Hyundai I20 N Line ) కూడా ఉంది.ఇది 2021లో మార్కెట్లోకి వచ్చింది.0 లీటర్ టీజీడీఐ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించింది.118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది.6 మాన్యువల్ గేర్లు ఉంటాయి.రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది.ఎక్స్ షో రూం ధర రూ.9.99 లక్షలు ఉంటుంది.మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్( Mahindra XUV300 Turbo Sport ) విషయానికి వస్తే ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.9.30 లక్షలుగా ఉంది.1.2 లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ ఇంజిన్ కలిగి ఉంటుంది.128 బీహెచ్‌పీ పవర్, 250ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 10.67 సెకన్లలో అందుకుంటుంది.4 వేరియంట్లలో లభిస్తుంది.ఇక మూడో కారు హ్యుందాయ్ వెన్యూ ఎన్‌లైన్.
( Hyundai Venue N Line ) దీని ఎక్స్ షోరూం ధర రూ.12.08 లక్షలు.

ఇందులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.6 గేర్లు ఉంటాయి.2 వేరియంట్లలో లభిస్తుంది.ఇక నాలుగో కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్.( Maruti Suzuki Fronx ) దీని ఎక్స్ షోరూం ధర రూ.9.72 లక్షలు.1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.99బీహెచ్‌పీ పవర్, 147 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.సిట్రోయెన్ సీ3( Citreon C3 ) కారు కూడా కొనుక్కోవచ్చు.
దీని ఎక్స్ షోరూం ధర రూ.8.28 లక్షలు.ఇందులో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.109 బీహెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.







