టమాటా( Tomato ).ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి.
గత కొన్ని రోజుల నుంచి టమాటాకి ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.టమాటాల కోసం దొంగతనాలు అప్వింటూనే ఉన్నాం.
కానీ హత్య జరగడం కలకలం రేపింది.అంతేకాదు తాజాగా ఒక టమాటా రైతు జీవితమే మారిపోయింది అనే వార్తలు వింటూనే ఉన్నాం.
కొన్నిరోజుల ముందు టమాటాలకి ఒక పాముని కాపలా పెట్టిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇప్పుడు టమాటాలను కాపాడుకోవడం కోసం ఒకరు పొలంలోనే సీసీటీవీ కెమెరా అమర్చాడు.
ఇప్పుడు ఈ వార్త నెట్టింట హాల్ చల్ చేస్తుంది.పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టమాటా.ఇప్పుడు కొనాలంటే చుక్కలు చూపిస్తుంది.టమాటా ధర సెంచరీ కాదు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది.పెరగడమే కానీ తగ్గేదేలే అంటుంది.అయితే ధరలు పెరుగుతుండడంతో టమాటా దొంగతనాలు జరుగుతున్నాయి.గత కొన్నిరోజులుగా ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టమాటాలను కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లో( Maharashtra Chhatrapati Sambhajinagar ) ఓ రైతు తెలివిగా ఆలోచించాడు.
వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో పొలంలోనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు.ఇప్పుడు మహారాష్ట్రలో కిలో టమాటా ధర సుమారు రూ.160 గా ఉందని సమాచారం.ఇప్పుడు ఈ రైతు చేసిన పనికి చాలా తెలివిగా ఆలోచించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట ఈ టమాటా దొంగతనాల కేసులు జరిగిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్తున్న రూ.21 లక్షలు విలువ చేసే టమాటా పండ్ల ట్రక్కు కనిపించకుండా పోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బటయ కూడా టమాటాల కోసం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
జార్ఖాండ్‌లోని దుకాణాల్లో 40 కిలోల టమాటాలను ఎత్తుకెళ్లారు.టమాటాలను కాపుడుకోడానికి మాత్రం కొత్త కొత్త ఐడియాస్ వేస్తున్నారు.ఇప్పటిలో టమాటా ధర తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.మరి టమాటాలను కాపాడుకోడానికి ఇంకా ఎవరు ఏ ఐడియాస్ వేస్తారో చూద్దాం.







