రూ.12 వందల కోట్ల బడ్జెట్ తో 36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ఏ సినిమా అంటే?

హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి మనందరికీ తెలిసిందే.ఇతనికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలువురు అభిమానులు ఉన్నారు.

 Tom Cruise Top Gun Maverick Sequel Coming After 36 Years Tom Cruise, Sequel Movie, Cannes Film Festivals, Hollywood, Top Gun Movie-TeluguStop.com

ఇకపోతే టామ్ క్రూజ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సాధించిన విషయం తెలిసిందే.అలా సూపర్ హిట్ సాధించిన సినిమాలలో టాప్ గన్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా 1986 లో విడుదలైన విషయం అందరికి తెలిసిందే.1986 లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యే ఇప్పటికి దాదాపుగా 36 ఏళ్లు పూర్తి అవుతుంది.అయితే 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా టాప్ గన్ : మేవరిక్ సినిమా తెరకెక్కబోతోంది.తాజాగా ఈ సినిమా ప్రీమియర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2022 ఉత్సవాలలో ప్రదర్శించారు.హాలీవుడ్ యాక్షన్ హీరో అయిన టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ సినిమాకు దాదాపు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా రావడం, దానిని కేన్స్ ఫెస్టివల్లో ప్రీమియర్ వేయడంతో ఈ సినిమాపై భారీగా హై ఏర్పడింది.

 Tom Cruise Top Gun Maverick Sequel Coming After 36 Years Tom Cruise, Sequel Movie, Cannes Film Festivals, Hollywood, Top Gun Movie-రూ.12 వందల కోట్ల బడ్జెట్ తో 36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ఏ సినిమా అంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను మే 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సినిమా కేవలం ఇంగ్లీష్ బాషలోనే కాకుండా తెలుగు, తమిళ,హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.ఈ సినిమాలో 1200 కోట్ల బడ్జెట్ తో జోసెఫ్ క తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్ కార్వి ఈ సినిమాకు రచనా సహకారం అందించారు.

హీరో టామ్ క్రూజ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన టాప్ గన్ సినిమాకు సీక్వెల్ గా సినిమా రావడానికి దాదాపుగా 36 ఏళ్లు పట్టింది.అయితే ఈ సినిమాను మూడేళ్ల క్రితమే మొదలు పెట్టినప్పటికీ కరోనా మహమ్మారి వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం టామ్ క్రూజ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube