జగన్ కి జై కొడుతున్న టాలీవుడ్..రీజన్ ఇదేనా

జగన మోహన్ రెడ్డి కి అనూహ్యంగా మద్దతు పెరుగుతూ వస్తోంది.ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి తోడూ అవ్వడంతో ఇప్పుడు జగన్ కి టాలీవుడ్ దగ్గర అవుతోంది.

 Tollywood To Support Ys Jagan-TeluguStop.com

వాస్తవానికి టాలీవుడ్ లో ఎక్కువ మంది ఎప్పుడు తెలుగుదేశానికి వెన్నంటి ఉండేవారు.అయితే ఇప్పుడు సీన్ మారింది.

టాలీవుడ్ మద్దతు ఒక్కసారిగా జగన్ వైపుకు మళ్ళనుంది…అందుకు తగ్గట్లుగానే తమ్మారెడ్డి భరద్వాజ , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సైతం జగన్ కి మద్దతుగా అనేకసార్లు మాట్లాడారు కూడా.కేంద్రంతో జగన్ చాల పెద్ద ఫైట్ చేస్తున్నాడు.

మోడీ తో డీ అంటే డీ అంటూ అవిశ్వాసం కూడా పెట్టాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు.ఇదే సమయంలో.

ఏపె సీఎం చంద్రబాబు ని విమర్సించే వాళ్ళు కూడా ఉన్నారు.కేంద్రంతో చెలిమి చెలిమి అంటూ కేంద్రాన్ని నిలదీయకుండా మిత్ర ధర్మం అంటూ ఇంతలా హోదా అంశాన్ని తొక్కి పెట్టేశారు అంటూ మంది పడుతున్నారు.

ముందు హోదా అవసరం లేదు అన్న చంద్రబాబు ఇప్పుడు జగన్ హోదా అనగానే ఎందుకు మళ్ళీ హోదా మాట ఎత్తుతున్నారో అర్థం కావడం లేదంటూ మండి పడుతున్నారట.అయితే జగన్ చెప్పినట్లుగా చంద్రబాబు చేసి ఉంటే ఎప్పుడో ఎపీకి హోదా వచ్చేదని అలా చేయకుండా మిత్ర ధర్మం అని తప్పించుకున్నారని చాటు చాటు విమర్సలకి దిగుతున్నారు టాలీవుడ్ లోని కొందరు వ్యక్తులు.

అంతేకాదు ఇప్పుడు తెలుగుదేశం ని టాలీవుడ్ పట్టించుకోక పోవడానికి కారణం లోకేష్ గతంలో టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలే కారణం అంటున్నారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి కి టాలీవుడ్ తో ప్రత్యేకంగా పరిచయాలు లేవు అయితే అక్కినేని ఫ్యామిలీ తో ముందు నుంచీ ఉన్న పరిచయం.

హీరో నాగార్జునతో ఉన్న చనువు.పైగా ఇద్దరు బిజినెస్ పార్టనర్స్ కావడంతో.

నాగార్జున వర్గం అంతా జగన్ కి జై కొడుతుంది.అంతేకాదు మరో పక్క పవన్ కళ్యాణ్ వర్గం ఇప్పుడు టాలివుడ్ లో అతిపెద్ద వర్గం అయ్యింది వారి సపోర్ట్ కూడా ఫ్యూచర్ లో జగన్ కి పుష్కలంగా దొరుకుతుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

అయితే జగన్ కి చివరి నిమిషం వరకూ వీళ్ళు సపోర్ట్ గా ఉంటారా ఎన్నికల సమయంలో జగన్ వద్దకి వచ్చి ప్రచారం నిర్వహిస్తార అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు వైసీపి వర్గాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube