టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్లు ఇవే.. చిరు, బాలయ్య ఎంత తీసుకుంటున్నారంటే?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి.

మార్కెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ ను పెంచడంలో తప్పు లేదని స్టార్ హీరోలు భావిస్తున్నారు.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలు అంతకు మించి డిమాండ్ చేస్తుండగా సీనియర్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాల కలెక్షన్లకు అనుగుణంగా పారితోషికం తీసుకుంటున్నారు.టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

ఈ స్టార్ హీరో పారితోషికం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.గత రెండు సినిమాలకు చిరంజీవి ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని భవిష్యత్తు సినిమాలకు సైతం 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం అందుతోంది.

స్టార్ హీరో బాలకృష్ణ విషయానికి వస్తే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాకు 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు మాత్రం బాలయ్య 16 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.వెంకటేశ్ 12 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటుండగా నాగ్ 10 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

Advertisement

సీనియర్ హీరో రవితేజ కూడా 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.బెల్లంకొండ శ్రీనివాస్ 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా నిఖిల్ 7 కోట్ల రూపాయలు, నాగశౌర్య 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.నాన్ థియేట్రికల్ హక్కులు, ఇతర హక్కులకు ఊహించని డిమాండ్ నెలకొనడంతో స్టార్ హీరోలు సైతం రెమ్యునరేషన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్స్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Advertisement

తాజా వార్తలు