టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.స్టార్ హీరోల సినిమాలు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ప్రూవ్ చేశాయి.
ఈ రెండు సినిమాలకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టడం గమనార్హం.
మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరో ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఎంతగానో ఉంటుంది.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోగా పవన్ కు పేరుంది.పవన్ సినిమా రిలీజైతే తొలిరోజు కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉంటాయి.
పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదివారు.పలు సందర్భాల్లో పవన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంటర్ వరకు చదివారు.పాన్ ఇండియా స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఇంజనీరింగ్ చదివారు.సూపర్ స్టార్ మహేష్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరో బీకాం చదివారు.ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్నారు.బన్నీ విషయానికి వస్తే ఈ స్టార్ హీరో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ విషయానికి వస్తే ఈ హీరో లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ చదివారు.సీనియర్ హీరోల విషయానికి వస్తే చిరంజీవి బీకాం చదవగా బాలయ్య కామర్స్ పట్టా పొందారు.వెంకటేష్ ఎంబీఏ చదవగా నాగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఈ హీరోల సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.