సినిమాలకు పండుగ సీజన్ లేదంటే సమ్మర్ సీజన్ లో వచ్చేంత కలెక్షన్స్ మరెప్పుడు రావు అనేది అందరికీ తెలిసిందే.అయినా కూడా 2023 సంవత్సరం సమ్మర్( Summer ) మొత్తాన్ని కూడా స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారు.
ఆ హీరో వస్తాడని ఈ హీరో… ఈ హీరో వస్తాడని ఆ హీరో తమ సినిమాలను సమ్మర్ లో కాకుండా ఆ తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకొని పెద్ద తప్పు చేశారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ను( Bhola Shankar Movie ) ఇప్పటికే ముగించేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఉంటే సమ్మర్ స్పెషల్ గా భారీగా కలెక్షన్స్ నమోదు అయ్యేవి కదా అంటూ కొందరు ఈ సందర్భంగా భోళా శంకర్ చిత్ర యూనిట్ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

కేవలం భోళా శంకర్ మాత్రమే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ సమ్మర్ కి ముందు పూర్తి చేసి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా షూటింగ్ పాన్ చేసుకుని ఉంటే కచ్చితంగా సమ్మర్ కి మంచి వినోదాల విందు లభించేది.కానీ ఈ మధ్య కాలంలో మొత్తం పరిస్థితి మారింది. సమ్మర్ కి పోటీ వద్దనుకునే ఉద్దేశంతో పలువురు హీరోలు సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.దాంతో ఈ సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు లేక ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు నెలల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు చాలా సినిమాలు వచ్చాయి.అందులో విరూపాక్ష చిత్రం( Virupaksha ) మినహా మరే సినిమా కూడా మినిమం కలెక్షన్స్ ని నమోదు చేయలేక పోయింది.దాంతో ముందు ముందు పరిస్థితి ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఆ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయి? ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.మొత్తానికి ఈ సమ్మర్ ని మాత్రం తెలుగు ఫిలిం మేకర్స్ మిస్ చేసుకోవడం అనేది బాధ కలిగించే విషయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.