సాధారణ ప్రజలకు సెలబ్రిటీల జీవితాలు ఎంతో అందంగా కనిపిస్తాయనే సంగతి తెలిసిందే.అయితే నిజ జీవితంలో సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
సాధారణ ప్రజలు సులువుగానే తమకు ఎదురయ్యే కష్టాల గురించి చెబితే సెలబ్రిటీలు మాత్రం ఆ కష్టాల గురించి చెప్పుకోవడానికి ఒకింత ఇబ్బంది పడతారు. కోలీవుడ్ ఇండస్ట్రీ( Kollywood )లో బుల్లితెర ద్వారా పాపులర్ అయిన షాలినికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా విడాకులు తీసుకున్న ఈ బుల్లితెర నటి భర్త ఫోటోలు చింపుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే విడాకులు తీసుకోవడం వెనుక గల కారణాలను, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా షాలిని( Shalini) చెప్పుకొచ్చారు.నా భర్త నన్ను ఎంతగానో టార్చర్ చేశాడని ఆమె అన్నారు.దుబాయ్ లో నా భర్త కొట్టిన సమయంలో పార్కింగ్ లో వచ్చి నేను పడుకునేదానినని షాలిని తెలిపారు.

తాను ఎప్పుడూ గొడవను పెద్దది చేయకుండా ఆపడానికి ప్రయత్నించేదానినని ఆమె చెప్పుకొచ్చారు.అంతకుమించి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదని షాలిని అన్నారు.పోలీసుల దగ్గరకు వెళ్లాలని అనిపించినా నా లైఫ్ నాశనమవుతుందని నేను ఆగిపోయేదానినని షాలిని చెప్పుకొచ్చారు.నా భర్త నన్ను ఎప్పుడు కొట్టినా నేను పార్కింగ్ ప్లేస్( Parking space ) లో పడుకునేదానినని ఆమె కామెంట్లు చేశారు.

నాలుగు సంవత్సరాల పాటు నా భర్త చేతిలో నేను దెబ్బలు తిన్నానని షాలిని చెప్పుకొచ్చారు.ఆ దెబ్బలు భరించలేక తిరగబడ్డానని నా బిడ్డ ఏడుస్తున్నా రాక్షసుడిలా మారి నా భర్త కొట్టాడని అందుకే తిరగబడ్డానని ఆమె కామెంట్లు చేశారు.నా బిడ్డకు అలాంటి తండ్రి అవసరం లేదని షాలిని వెల్లడించడం గమనార్హం.షాలిని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







