ఏంటో ఈ మధ్య కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు.గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లు అందుకోలేక పోతున్నారు.
కారణం వాళ్లు సరైన కథలు ఎంచుకోలేకపోతున్నారు.తొందరపడి వచ్చిన సినిమాలకు ఏ మాత్రం ఆలోచించకుండా కమిట్మెంట్ చేసి నిరాశ పడుతున్నారు.
ఇక రీసెంట్గా తమ సినిమాలతో భారీ అంచనాలు క్రియేట్ చేసి చివరికి కొరడా దెబ్బలు తిన్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ.సరైన సక్సెస్ అందుకోవటం లేదు.పైగా అన్ని రీమేక్ సినిమాలు చేస్తూ ఉండగా జనాలు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు.
ఇక అభిమానులు రీమేక్ సినిమాలు వద్దని.కొత్త కథలను ఎంచుకోమని.
లేదంటే నిరాశ చెందక తప్పదని అంటూనే ఉన్నారు.ఇక గతంలో ఆచార్య సినిమాతో పెద్ద దెబ్బతిన్నాడు.

నాగార్జున:
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రారాజుగా ఏలిన నాగార్జునకు( Nagarjuna ) ఇప్పుడు అస్సలు కలిసి రావడం లేదు.పైగా తొందరపడి కథలను ఎంచుకొని పొరపాటు చేస్తున్నాడు.ఈమధ్య ఈయన చేసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి.బాగా హోప్స్ పెట్టుకున్న ఘోస్ట్ సినిమా మాత్రం బాగా దెబ్బతీసిందని చెప్పాలి.

అఖిల్:
నాగార్జున ముద్దుల వారసుడికి హీరోగా కలిసి రావట్లేదు అని చెప్పాలి.ఇప్పటికీ పలు సినిమాలలో చేసినప్పటికీ కూడా ఏ సినిమా సరైన హిట్టు అందివ్వలేకపోయాయి.హీరోగా అడుగు పెట్టినప్పటి నుంచి ఈయన ఒక సక్సెస్ అనేది తెచ్చుకోలేకపోయాడు.ఇక రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో భారీ అంచనాలు క్రియేట్ చేయగా ఈ సినిమా కూడా ప్లాఫ్ అయ్యింది

నాగచైతన్య:
నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య కి( Naga Chaitanya ) అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ ఎందుకో సరైనా సక్సెస్ తెచ్చుకోలేకపోతున్నాడు.చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా స్టార్ హోదాకు చేరుకోలేకపోతున్నాడు.ఇక ఆ మధ్యనే వచ్చిన థాంక్యూ సినిమా ఫ్లాప్ అవ్వగా.
రీసెంట్ గా హోప్స్ పెట్టుకున్న కస్టడీ సినిమా కూడా బోల్తా పడింది.

విజయ్ దేవరకొండ:
రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గీత గోవిందం తర్వాత మళ్లీ అటువంటి సక్సెస్ అనేది తెచ్చుకోలేకపోయాడు.గత ఏడాది లైగర్ సినిమాతో భారీ అంచనాలు క్రియేట్ చేశాడు.సీన్ కట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
దీంతో ఇప్పుడు హోప్స్ అన్ని ఖుషి సినిమా పై పెట్టుకున్నాడు.

రవితేజ:
మాస్ మహారాజ్ రవితేజ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అందివ్వగా గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.ఇప్పటికే ఖిలాడి, రాడ్ సినిమాలతో నిరాశ చెందగా రీసెంట్గా వచ్చిన రావణాసురతో కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు.

ప్రభాస్:
పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ప్రభాస్ కు బాహుబలి తర్వాత అంత హిట్ ఏ సినిమా తేలేకపోయాయి.అన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినప్పటికీ కూడా అవి బాగా నిరాశపరిచాయి.గత ఏడాది రాధేశ్యామ్ సినిమాతో డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా నిరాశపరిచిందని చెప్పాలి.