ఒకప్పుడు సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం.కానీ ఇప్పుడు హీరోలు ఈజీగా వంద కోట్ల పారితోషికం దక్కించుకుంటున్నారు.
ఆశ్చర్యకర విషయం ఏంటి అంటే ప్రతి హీరో కూడా తన సినిమా సక్సెస్ అయిన వెంటనే భారీగా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నాడు.తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్( Vijay Talapathy ) చేసిన పని అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించేందుకు గాను ఏకంగా రూ.150 కోట్ల ను డిమాండ్ చేసినట్లుగా తమిళ మీడియా లో ప్రచారం జరుగుతోంది.ఈ విషయం నిజమే అన్నట్లుగా తమిళ ఇండస్ట్రీ వారు కూడా చెబుతున్నారు.
ఈ స్థాయిలో పారితోషికం ఆయనకే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో విజయ్ పారితోషికం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ఇక తెలుగు లో హీరోలు వంద కోట్ల పారితోషికం దక్కించుకోవడానికే కిందా మీదా పడుతున్నారు.అలాంటిది ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అంటే మామూలు విషయం కాదు.సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ స్థాయి పారితోషికం తీసుకున్న వారు లేరు.అలాంటిది 100 కోట్లకు పైగా పారితోషికంను డిమాండ్ చేయడం విడ్డూరం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు లో ఎంత మంది హీరోలు వంద కోట్లు ఆపై తీసుకుంటున్నారో తెలుసా.
బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం తన ప్రతి సినిమాకు కూడా వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు.ఇక అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమా ను చేస్తున్నాడు.
ఆ సినిమాకు గాను వంద కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాఉడ.ఇక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కూడా కాస్త అటు ఇటుగా అదే స్థాయి లో పారితోషికం అందుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు కాస్త తక్కువ వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు.