కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అంటూ 3 కోట్ల రూపాయిలు బెట్టింగ్ వేసిన టాలీవుడ్ స్టార్ హీరో!

తెలంగాణ లో సరిగ్గా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల జరగబోతున్నాయి.రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు.

 Tollywood Star Hero Who Bet 3 Crore Rupees That Kcr Will Become Cm Again Details-TeluguStop.com

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) మరియు కాంగ్రెస్ పార్టీ( Congress ) మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో హోరాహోరీ పోటీ ఉంది.ఇదంతా పక్కన పెడితే ఎన్నికల సమయం వచ్చినప్పుడు బెట్టింగ్స్ వెయ్యడం అనేది సర్వ సాధారణం.

ఎక్కువగా క్రికెట్ లో మరియు రాజకీయాల్లో ఇలాంటి బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి.అలాగే ఈసారి కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేదానిపై తెలంగాణ లో ఒక రేంజ్ లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి.

బీఆర్ ఎస్ కి కేసీఆర్( KCR ) ముఖ్యమంత్రి అభ్యర్థి , అది అందరికీ తెలిసిందే.కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.దీని మీద కూడా బెట్టింగ్స్( Betting ) జరుగుతున్నాయి.సామాన్యులు బెట్టింగ్ వేసుకోవడం సర్వసాధారణం , కానీ ఒక యంగ్ హీరో( Young Hero ) కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ మూడు కోట్ల రూపాయిలు బెట్టింగ్ వేసాడట.

ఇదే ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది.

కేవలం ఈ ఒక్క హీరో నే కాదు , టాలీవుడ్ లో మరికొంత మంది కుర్ర హీరోలు కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై బెట్టింగ్స్ వేస్తున్నారు.అయితే ఒక యంగ్ హీరో మూడు కోట్ల రూపాయిలు బెట్టింగ్ వెయ్యడమే అత్యధికం అని టాక్.ఈ హీరో కి మొదటి నుండి కేసీఆర్ మంచి స్నేహితుడు.

ఇతని సినిమాలకు కేసీఆర్ కూతురు కవిత( Kavitha ) గారు ఫండింగ్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు కానీ ఈపాటికే ఆ హీరో ఎవరో అర్థం అయినవాళ్ళకి అర్థం అయ్యే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube