టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) క్రేజ్ పరంగా ఎన్నో రెట్లు టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం సందడి చేయనుందని గతంలోనే ప్రచారం జరగగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది.అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడటం గమనార్హం.

2025 సంవత్సరం సమ్మర్ సమయానికి రామ్ చరణ్ విగ్రహాన్ని సందర్శన కొరకు అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ తనకు దక్కిన ఈ అరుదైన ఘనత విషయంలో సంతోషం వ్యక్తం చేశారు.సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ ( Madame Tussauds )లో కొలువుదీరిన సూపర్ స్టార్స్ సరసన చేరడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం అని రామ్ చరణ్ వెల్లడించారు.

చిన్నప్పుడు లెజెండరీ నటుల విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయేవాడినని అలాంటిది వారి పక్కన నాకు ఇంతటి గౌరవం దక్కుతుందని కలలోనైనా ఊహించలేదని చరణ్ తెలిపారు.కష్టం, సినిమాల విషయంలో నాకున్న ఫ్యాషన్ వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.అపురూపమైన అవకాశాన్ని ఇచ్చిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు ధన్యవాదాలని చరణ్ తెలిపారు.
క్వీన్ ఎలిజబెత్2 తర్వాత పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించనున్న వ్యక్తిగా రామ్ చరణ్ నిలిచారు.రామ్ చరణ్ కు క్లీంకార పుట్టిన తర్వాత దక్కుతున్న అరుదైన ఘనతలు ఫ్యాన్స్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
రామ్ చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.చరణ్ క్రేజ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.







