టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ లుక్ తో కనిపించే హీరోలలో నాగార్జున ఒకరు.సంవత్సరాలకు సంవత్సరాలు పెరుగుతున్నా నాగార్జున మాత్రం అదే ఉత్సాహంతో, అంతే ఉల్లాసంగా సినిమాల్లో నటిస్తూ, టీవీ షోలను హోస్ట్ చేస్తున్నారు.
తొలుత బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వను అవ్వ అని పిలిచిన నాగ్ తాజా ఎపిసోడ్లలో మాత్రం చెల్లి అని పిలుస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ వల్లే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్గా మెప్పించిన నాగార్జున సీజన్ 4 లోనూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు.గత కొన్నేళ్ల నుంచి పరిమితంగా సినిమాలు చేస్తున్న నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరైన నాగార్జున నవ్యత ఉన్న కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.గతంలో పలు ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన నాగ్ ఆ సినిమాలు ఆశాజనకమైన ఫలితాలు రాబట్టలేకపోయినా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇకపోతే నాగార్జున చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెరిగిన జుట్టుతో అమాయకంగా పాపను ఎత్తుకున్న నాగ్ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
వయస్సు ఎంత పెరిగినా నాగార్జున నేటికీ యంగ్ లుక్ తోనే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా నాగార్జున అన్ని జోనర్ల సినిమాలలో నటిస్తూ తన వారసులను కూడా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలుగా గుర్తింపు వచ్చేలా చేశారు.
చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న నాగార్జున విక్రమ్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.శివ, అన్నమయ్య, శ్రీరామదాసు, శివమణి తదితర సినిమాల్లో ప్రేక్షకులకు చిరకాలం గుర్తిండిపోయే పాత్రల్లో నటించారు.
నేటికీ అన్ని జోనర్ల సినిమాలలో నటిస్తూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు.