టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో విడుదలైన పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.అయితే హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకోవడం వెనక డైరెక్టర్ల కృషి ఎంతో ఉంది అని చెప్పవచ్చు.
ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు.అయితే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు.
రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గం స్టార్ డైరెక్టర్స్ అని చెబుతున్నారు.
మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఏ దర్శకుడు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను దాదాపుగా 80 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లతో పోలిస్తే రాజమౌళి ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడం గమనార్హం.
మరే డైరెక్టర్ తీసుకొని విధంగా రాజమౌళి భారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్నాడు.తదుపరి రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు గాను దాదాపుగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అని తెలుస్తోంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల విజయాలతో 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారు.దర్శకుడు ప్రశాంత్ నీల్ పారితోషికం తో పాటు వాటా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పుష్ప పార్ట్ 1 కు గాను సుకుమార్ దాదాపుగా 25 కోట్ల పారితోషికాన్ని తీసుకోగా పార్ట్ 2 కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా ఒక సినిమాకు 25 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.







