టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్న కొందరు ఒకప్పుడు తెలుగు సినిమాల్లోనే జూనియర్ ఆర్టిస్టులుగా కనిపించారు.ఇప్పుడు వీరు పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు.
వారెవరో, ఏ సినిమాలో ఏ సన్నివేశంలో నటించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నాగ్ అశ్విన్ లైఫ్ “ఈజ్ బ్యూటిఫుల్”( Nag Ashwin ) సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.
క్రికెట్ ఆడుతుండగా దూరంగా నిల్చొని చూసే సన్నివేశంలో అతను కనిపిస్తాడు.మహర్షి, ఊపిరి, మున్నా వంటి సినిమాలు తీసిన వంశీ పైడిపల్లి “వర్షం” సినిమాలో ప్రభాస్, త్రిష బస్సులో ప్రయాణిస్తూ ఉంటే, వారికి తోటి ప్యాసింజర్ గా కనిపిస్తాడు.
ప్రభాస్ త్రిష కూర్చున్న సీటు నుంచి రెండో వరుస సీట్ లో కిటికీ పక్కన అతను కనిపిస్తాడు.

భగవంత్ కేసరి, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, సుప్రీమ్, పటాస్ వంటి సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి “సౌర్యం” సినిమాలో చిన్న వేషం వేశాడు.ఒక కాలేజీ సెట్టింగ్స్ లో అతను కనిపిస్తాడు.అతను అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మారలేదని చెప్పుకోవచ్చు.
అందువల్ల ఈ డైరెక్టర్ ను సౌర్యం సినిమా చూసినవారు గుర్తుపట్టే ఉంటారు.స్టాలిన్( Stalin ) మూవీలో గోపీచంద్ మలినేని ఒక యాచకురాలతో మాట్లాడుతున్న సన్నివేశంలో కనిపించాడు.
ఈ డైరెక్టర్ పండగ చేస్కో, డాన్ శీను వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కేడి మూవీలో మెరిసాడు.సింగిల్ ఫ్రేమ్ లో మాత్రమే అతను ఈ సినిమాలో కనిపిస్తాడు.ఇప్పుడు ఈ డైరెక్టర్ యానిమల్ మూవీ తీస్తున్నాడు.
దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.నారప్ప, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, కొత్త బంగారులోకం, బొమ్మరిల్లు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాలో చిన్న రోల్ పోషించాడు.శ్రీకాంత్ అడ్డాల అప్పట్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు.”అందరివాడు” సినిమాలో హరీష్ శంకర్( Harish Shankar ) బ్రహ్మానందంతో కలిసి ఒక సన్నివేశంలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బ్రహ్మానందం మాట్లాడుతూ ఉంటే హరీష్ శంకర్ చాలా కామ్ గా చేతులు కట్టుకొని ఈ సన్నివేశంలో కనిపిస్తాడు.ఇక ఈ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నేనింతే, నిప్పు, షాక్ వంటి సినిమాలు తీశాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.