సౌత్ ఇండియా హీరోయిన్స్ సరికొత్త కండీషన్స్.. యాక్సెప్ట్ చేస్తున్న మేకర్స్..

ఒకప్పటిలాగా కాదు ప్రజెంట్ హీరోయిన్స్ ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి అనతి కాలంలోనే వెళ్లిపోతున్నారు.

అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

ముఖ్యంగా సౌత్ ఇండియా హీరోయిన్స్ ఇటు సౌత్ ఇండియా ఇండస్ట్రీస్‌తో పాటు నార్త్ ఇండియా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు.ఆ హీరోయిన్స్ ఎవరంటే.

రష్మిక మందన, కీర్తి సురేశ్, సమంత, సాయిపల్లవి తో పాటు ఇంకా పలువురు సౌత్ హీరోయిన్స్ సరికొత్త కండీషన్స్‌తో సినీ పరిశ్రమలో ముందుకు సాగుతున్నారు.తమ టాలెంట్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశంతో పాటు మంచి రోల్ ఇస్తే చాలు.

ఏ సినిమాకు అయినా తాము ఓకే చెప్తాం అనే కండీషన్స్‌ను ఈ హీరోయిన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.నేషనల్ క్రష్ రష్మిక మందన అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతోంది.

Advertisement
Tollywood New Heroines New Conditions Details, Tollywood Heroines, Rashmika Mand

టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ క్యారెక్టర్ నచ్చితే చాటు తప్పకుండా సినిమా చేసేస్తుందట.తాజాగా పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’నుంచి శ్రీవల్లి లుక్ రిలీజ్ కాగా, అది ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో చిత్తూరు జిల్లాకు చెందిన సంప్రదాయ గిరిజన యువతిగా రష్మిక మందన కనిపించనుంది.ఇక ఫస్ట లుక్‌లో రష్మిక లంగా వోణి ధరించి పైట లేకుండా దేవుడి ముందర కమ్మలు పెట్టుకున్నట్లు ఉన్న స్టిల్ చూసి అభిమానులు రష్మికను తెగ పొగిడేస్తున్నారు.

Tollywood New Heroines New Conditions Details, Tollywood Heroines, Rashmika Mand

సినిమా హిట్ గ్యారంటీ అని అంటున్నారు.తను చేసే సినిమాల్లో హీరోతో సమానమైన రోల్ ఉండేలా రష్మిక చూసుకుందట.శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీస్ ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ ఫిల్మ్స్‌లో రష్మిక నటిస్తోంది.

కీర్తి సురేశ్, పూజా హెగ్డే, సమంత, సాయిపల్లవి కూడా ఇంట్రెస్టింట్ రోల్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.కీర్తి సురేశ్ అయితే ఏకంగా సిస్టర్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఫిల్మ్‌లో చిరుకు సిస్టర్‌గా కీర్తి సురేశ్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు