80,000 టూత్ బ్రష్ లతో గిన్నిస్ రికార్డ్ సాధించిన డాక్టర్ రెడ్డీస్..!

ప్రపంచంలోనే అతిపెద్ద టూత్ బ్రష్ మినార్ ను సృష్టించి ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గిన్నిస్ రికార్డు సాధించింది.సుమారు 80 వేల బ్రష్ లను ఉపయోగించి ఫాస్ట్ మినార్ ను తయారుచేసింది.

 Guinness World Record Holder Dr. Reddy's With 80,000 Toothbrushes, 80000 Trooth-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఉన్న 8,990 మంది దంత వైద్యులు ఈ ఫాస్ట్ మినార్ నిర్మాణానికి ఉపయోగించిన టూత్ బ్రష్ లను అందించారు.దంత సంరక్షణ పై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ పేర్కొంది.

అయితే ఈ ఫాస్ట్ మీనార్ ను.నవీ ముంబైలోని టెర్నా డెంటల్ కళాశాలలో డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ టూత్ బ్రష్ శిల్పంను నిర్మించింది.దీనికి గిన్నిస్ రికార్డ్ లభించింది.అయితే 80,000 బ్రష్ లతో నిర్మించిన ఈ ఫాస్ట్ మినార్ 40 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఫాస్ట్ మినార్ అని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.

టెర్నా డెంటల్ కళాశాలలో 360 రోజుల పాటు ఈ ఫాస్ట్ మినార్ ప్రదర్శనలో ఉంటుందని, ఆ తర్వాత దాన్ని పడగొట్టి, ఆ టూత్ బ్రష్ లన్నింటిని రీసైకిల్ చేసి నిర్మాణ కార్యకలాపాల్లో ఉపయోగిస్తామని డాక్టర్ రెడ్డిస్యాజమాన్యం వెల్లడించింది.డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డెంటల్ కాలేజీ అధికారుల సమక్షంలో ​హైదరాబాద్ కు చెందిన ఫార్మా బృందంఈ టూత్ బ్రష్ ఫాస్ట్ మినార్ ను రూపొందించింది.

Telugu Trooth Brush, Dr Reddys, Latest-Latest News - Telugu

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ ధోబ్లే ఈ టూత్ బ్రష్ ఫాస్ట్ మినా ర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి దంత సమస్యల తో బాధపడుతున్నారని, దీనికి కారణం దంత సమస్యల పై అవగాహన లేకపోవడమేనని ఆయన తెలిపారు.అయితే పిల్లల్లో ముందుగా గుర్తిస్తే దంత సమస్యలు రావని, వచ్చినా వాటిని క్లియర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube