అన్నీ ఓకే కానీ.. అక్కడ మాత్రం ఇబ్బంది పడుతున్న టాలీవుడ్.. ఏం జరిగిందంటే?

కరోనా రాకముందు తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో ఉంటూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.మినిమం యావరేజ్ సినిమాకి కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.

 Tollywood Movies Struggle In Us Details, Tollywood, Us , Struggules, Tollywood-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు సినిమాలకు మరొక నైజాం ఏరియా అన్నట్టుగా ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో అత్యధిక వసూళ్లు నమోదు అయ్యేవి.కరోనాకు ముందు అమెరికాలో చిన్న సినిమాలు సైతం మిలియన్ డాలర్లు వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించాయి హిందీ సినిమాలు అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావడానికి సతమతమౌతుంటే తెలుగు సినిమాలు మాత్రం మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి.

కరోనా వచ్చిన తర్వాత అమెరికాలో పూర్తిగా తెలుగు సినిమా పట్టు కోల్పోతుందని చెప్పాలి.స్టార్ హీరో హీరోయిన్లు పేరు చెప్పినా కాని బాక్సాఫీస్ వద్ద వారం రోజుల తర్వాత మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.

ఇకపోతే ఈ సినిమా వారం రోజుల తర్వాత కలెక్షన్ల విషయంలోనే కాకుండా స్ట్రీమింగ్ విషయంలో కూడా ఎంతో కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది.కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలకు సైతం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

గత కొద్దిరోజుల నుంచి వరుసగా విడుదలవుతున్న తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం వారం రోజులపాటు మంచి కలెక్షన్లను రాబట్టిన వారం రోజుల తర్వాత కలెక్షన్లను పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా స్ట్రీమింగ్ కూడా ఎంతో కష్టతరంగా మారింది.

Telugu Big Budget, Anil Ravipudi, Mark, Struggules, Telugu, Tollywood, Tollywood

ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు వన్ మిలియన్ మార్క్ కూడా చేరుకోక పోవడం గమనార్హం.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అమెరికాలో 1.5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేస్తుందని అందరూ భావించినప్పటికీ ఈ సినిమా మాత్రం వన్ మిలియన్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది.ఇకపోతే మేజర్ సినిమా కూడా వన్ మిలియన్ క్రాస్ చేయలేకపోయిన్నట్లు తెలుస్తోంది.ఇలా కరోనా తరువాత అమెరికాలో తెలుగు సినిమా పూర్తిగా పట్టు కోల్పోతుందని చెప్పవచ్చు.కేవలం కరోనా పరిస్థితుల కారణంగా అమెరికాలో తెలుగుసినిమాకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube