ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమ కుదేలవుతుందనే చెప్పుకోవాలి.లవ్, యాక్షన్, డ్రామా, మర్డర్ మిస్టరీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ఏ జోనర్ తీసుకున్న కూడా సినిమాని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి.
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం వరస పరాజయాల పరంపర కొనసాగుతుంది.చివరికి ఎలాంటి జోనర్ లో సినిమా తీయాలో తెలియక అందరూ దేవుడిపైనే భారం వేస్తున్నారు.
దివోషనల్, మైథాలజికల్ సినిమాలు తీయడానికి ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు ముందుకు వస్తున్నారు.స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ దేవుడిని నమ్ముకునే సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారు.
రొటీన్ లవ్ స్టోరీలు, అవే పాటలు, అవే ఫైట్స్, సేమ్ డ్రామా ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తున్నాయి.ఎలాంటి కథతో సినిమా తీసిన డిజాస్టర్ తప్పడం లేదు.అయితే విచిత్రంగా డివోషనల్ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.ఇక కొన్నాళ్ల క్రితం రాజమౌళి కూడా ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
రానున్న రోజుల్లో మైథాలజికల్ సినిమాలు మాత్రమే ఆడుతాయి అంటూ చెప్పారు.నిజానికి అఖండ సినిమా నుంచి ఆది పురుష్ సినిమా వరకు డివోషనల్ బేస్ లోనే వస్తున్నాయి.

ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అలాగే కార్తికేయ 2 సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.ఇక ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా సైతం డివోషనల్ సినిమానే కావడం కోసమెరుపు.ఇలా స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా అందరూ దేవుని పై నమ్మకం పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు.దేవుడు అనే ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
మరి ఈ జోనర్ ఎన్నాళ్లపాటు నడుస్తుందో తెలియదు కానీ రానున్న రోజుల్లో కొత్త సినిమా, కొత్త కథ కావాలని ప్రేక్షకులు మాత్రం కోరుకుంటున్నారు.







