తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల పబ్ ఆవరణలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.రేవంత్ రెడ్డి ఆరోపించినట్లు ఆ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలోని పెద్దమ్మతల్లి గుడి ఆవరణలో జరగలేదని తేల్చి చెప్పారు.
దేవాలయంలో అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదన్నారు.ఆలయ పరిధిలో అత్యాచారం జరిగిందని అసత్య ప్రకటనలు చేసినందుకు గాను… రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.







