టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమా లకు ఇస్తున్నంత ప్రాముఖ్యత బిగ్ బాస్ కి కూడా ఇస్తున్న విషయం తెలిసిందే.వరుసగా నాలుగు సీజన్ల కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ప్రస్తుతం సీజన్ 6 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈసారి అత్యధిక పారితోషకము ను నాగార్జున తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.పారితోషికం విషయంలో నాగార్జున ఎప్పుడు కూడా ఆసక్తి చూపించడు.
కానీ ఆయన ఈ షో ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నానని ఉద్దేశంతోనే చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.ఇటీవల ఆయన రెమ్యూనరేషన్ పెంచినంత మాత్రాన ముందు ముందు కూడా కంటిన్యూ అవుతాడని కొందరు భావిస్తున్నారు.
కానీ తాజాగా అందిస్తున్న సమాచారం ప్రకారం ఇటీవల బిగ్ బాస్ రేటింగ్ మరి దారుణంగా పడి పోయింది, దాంతో ఈ షో యొక్క ప్రేక్షకుల ఆదరణ తగ్గుతుందని క్లారిటీ వచ్చేసింది.అందుకే నాగార్జున మెల్ల మెల్లగా ఈ కార్యక్రమానికి దూరమయ్యే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
త్వరలోనే నాగార్జున బిగ్ బాస్ ప్రేక్షకులకు చేదు నిజాన్ని చెప్పే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొందరు సీజన్ 10 వరకు ఆయనే పోస్ట్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు.

ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆ విషయమై ఒప్పందం చేసుకున్నారని నాగార్జున ఆ ఒప్పందం నుండి బయటకు వెళ్లలేడు అంటూ ఆయన సన్నిహితులు కొందరు చెప్తున్నారు.అదే నిజమైతే అభిమానులకు గుడ్ న్యూస్.కానీ పుకార్లు మాత్రం కాస్త బలంగానే వినిపిస్తున్నాయి.
నాగార్జున ఈ సీజన్ తర్వాత ఉండడు అనే వార్తలు కొందరు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.అసలు విషయం ఏంటి అనేది చూడాలి.
మరో వైపు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలకు రెడీగా ఉంది.దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీకున ఆ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.







