తెలుగు సినిమా ఒక స్వర్ణ యుగం లాంటిది .. అందుకు నిదర్శనం వీరే !

తెలుగు సినిమా ఒక స్వర్ణ యుగం లాంటిది అంటే నమ్మే వాళ్ళు ఎంతమంది.? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే.ఎందుకంటే గతంలో లవకుశ సినిమా చూడాలంటే కుటుంబం మొత్తం ఎడ్లబండ్ల పై వెళ్లే వారట.అంత దూరం వెళ్తారు కాబట్టి థియేటర్ల వద్ద వంట చేసుకుని తిని సినిమా చూసి ఇంటికి వచ్చేవారట.

 Tollywood In All Genarations , Tollywood ,  Genarations, Ntr , Nagarjuna , Chant-TeluguStop.com

ఆ సమయంలో ఒక్కో సినిమా ఏకంగా 500 రోజులు లేదంటే సంవత్సరం పాటు ఆడేవి.హీరో పేరు తెలియకుండా కూడా 500 రోజులపాటు ప్రేమ సాగర సినిమాను అప్పట్లో ఆడించారట.

అంతలా సినిమాపై జనాల్లో ఆసక్తి ఉండేది.నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలను గతంలో ఎక్కువగా చూసేవారు కానీ ఎన్టీఆర్ సినిమాలకే సంచలనమైన కలెక్షన్స్ ఉండేవి.

Telugu Chanti, Chiranjeevi, Mohan Babu, Nagarjuna, Prabhas, Raghavendra Rao, Raj

ఈ ఇద్దరు హీరోల తర్వాత శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి హీరోలు అందరూ కూడా యువతరం హీరోల కింద లెక్క.బాలకృష్ణ హీరోగా ఒక ఏడాది పాటు సినిమాలు తీసిన తర్వాత చిరంజీవి హీరోగా రావడంతో తెలుగు సినిమా యొక్క దశ మొత్తం మారిపోయింది.చిరంజీవి నటించిన ఖైదీ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.ఆ సినిమా చూసిన వారందరూ కూడా లవకుశ సినిమాకు వచ్చిన ప్రభంజనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.ఇక మరొక్క తరం దాటి వస్తే నాగార్జున సైతం అత్యంత పెద్ద హిట్టు కొట్టి సంచలనం సృష్టించారు.అప్పటి సినిమా ఇండస్ట్రీ శివకు ముందు ఒక శివ తర్వాత ఒకలా మారింది అంటూ ఉంటారు.

ఇక ఇదే అలజడిలో నాగార్జునతో పాటు వెంకటేష్ చంటి, సుందరాకాండ వంటి సినిమాలు మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి వీరే కాకుండా వీరితో పాటు సమాంతరంగా మోహన్ బాబు రాజశేఖర్ వంటి జనరేషన్ హీరోలు కూడా వచ్చారు.

Telugu Chanti, Chiranjeevi, Mohan Babu, Nagarjuna, Prabhas, Raghavendra Rao, Raj

ఇక ప్రస్తుతం మనం చూస్తున్న తరంకి ఒక్క అడుగు ముందుకు వేస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు రవితేజల జనరేషన్ సినిమాలు.జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ వంటి హీరోల హవా ప్రస్తుతం బాగా నడుస్తోంది.ఇక దర్శకుల విషయానికొస్తే మొదటి తరం అంత కేవీ రెడ్డి గారు, విక్టరీ మధుసూదన్ రావు, పుల్లయ్య, కామేశ్వరరావు వంటి వారి హవా సాగగా ఆ తర్వాత దాసరి, రాఘవేంద్రరావు వంటి దర్శకుల హవాసాగింది వీరంతా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో పెంచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube