హీరోయిన్ లకు సంబంధించిన ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో కేవలం తక్కువ సమయంలోనే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.హీరోయిన్లు సినిమాలు చేసి మంచి విజయం సాధించినప్పుడు అభిమానులు ఎంత ఆనంద పడిపోతారో.
ఇక పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంతే ఆనంద పడిపోతూ వుంటారూ అభిమానులు.ఇక కొన్ని కొన్ని సార్లు తల్లి కాబోతున్న అంటూ హీరోయిన్లు అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం తో అభిమానులు ఎంతగానో మురిసిపోతుంటారు.
ఇటీవలి కాలంలో గర్భవతిగా ఉన్న ముగ్గురు హీరోయిన్ల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్.ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.
కాజల్ అగర్వాల్ :
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే తల్లి కాబోతున్న అంటూ గుడ్ న్యూస్ చెప్పింది.దాదాపు దశాబ్ద కాలానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అగర్వాల్ తన అందం అభినయంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిందే.ఇక మరికొన్ని రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇక తన ప్రెగ్నెన్సీ లోని ప్రతి దశను కూడా ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నట్లు చెబుతుంది కాజల్ అగర్వాల్.

సంజన గల్రాణి :
యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాతో సంజన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఇక ఈ సినిమాలో త్రిషతో పాటు మరో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ.ఇక తన అందం అభినయంతో ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత సమర్ధుడు యమహో యమ,సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసింది.
ఇకపోతే ఇటీవలే అజీజ్ భాష అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే తను తల్లిని కాబోతున్నా అంటూ ఇటీవల అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది సంజన.

భర్తీ సింగ్ :
కమెడియన్గా టీవీ ప్రెజెంటర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న భర్తీ సింగ్ తన కామెడీ టైమింగ్ తో ఎంతగానో పాపులారిటీ సాధించింది.ఎన్నో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.అయితే ఇటీవలే గర్భవతి అన్న విషయాన్ని అభిమానులతో పంచుకునీ గుడ్ న్యూస్ చెప్పింది ఇక తన ప్రెగ్నెన్సీలో ప్రతి దశను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.ఇటీవలే తన భర్త హార్శ్ తో కలిసి మెటర్నిటీ ఫోటోషూట్ చేసి ఇక దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఏప్రిల్ నెలలో బిడ్డకు జన్మనివ్వ బోతుంది ఈ సెలబ్రిటీ.







