కాలం ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఎవరు ఊహించలేరు.ఒక్కోసారి తాము కమర్షియల్ హీరోయిన్స్ అంటూ విర్రవీగే హీరోయిన్స్ సైతం వెనక్కి తగ్గాల్సి వస్తుంది.
మరోసారి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ వారి నటనతో మరిన్ని అవకాశాలను సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తారు.కొంత మంది హీరోయిన్స్ కమర్షియల్ గా ఫ్లాప్ అవుతున్న తమపై ఎలాంటి ప్రభావం పడదు అనుకున్న వారు పొరపాట్లు చేస్తూ మొదటికే మోసం వచ్చేలా వ్యవహరిస్తున్నారు.మరి టాలీవుడ్ లో కంటెంట్ కమర్షియల్ అని రెండు రకాలుగా విడదీసి చూస్తున్న పరిస్థితులలో ఏ హీరోయిన్ కి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కృతి శెట్టి

ఉప్పెన( Uppena ) సినిమాతో మొట్ట మొదటిసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకొని ఆ తర్వాత మరిన్ని హిట్ సినిమాల్లో నటించింది కృతి శెట్టి( Krithi Shetty ) కమర్షియల్ కథలను సరిగ్గా ఎంచుకోవడంలో పొరపాట్లు చేసిన కృతి ఈరోజు ఒక ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది.ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.అందుకే తమిళంలో ఆమె అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.తెలుగులో ఎవరైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని కూడా ఎదురుచూస్తుంది.
శివాని
రాజశేఖర్( Shivani Rajashekar, ) జీవిత దంపతులకు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శివాని.మొదట్లో కొన్ని తప్పటడుగులు వేసిన కోటబొమ్మాలి పిస్ అనే కంటెంట్ ఉన్న సినిమాతో ఆమె మొట్టమొదటిసారి హీరోయిన్గా మంచి ఎలివేషన్ దక్కించుకుంది ఇదే ఊపులో మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలకు పచ్చ జెండా ఊపుతుంది ఇప్పటికే తమిళ్ లో రెండు సినిమాలు చేసింది.ప్రస్తుతం మరొక తమిళ సినిమా ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
ఇలాగే శివాని ఆచితూచి అడుగులు వేస్తే మరిన్ని సినిమాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీ లీల
పెళ్లి సందడి ధమాకా వంట సినిమాల్లో నటించి హీరోయిన్ మెటీరియల్ అంటే ఈమె అని అనిపించే విధంగా శ్రీ లీల( Sreeleela ) నటనను ప్రదర్శించింది.ఈ సినిమా తర్వాత అనేక కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటూ వెళ్ళింది.అయితే భగవంత్ కేసరి మినహా ఈ మధ్యకాలంలో ఆమె నటించడం సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో శ్రీలీల పై భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.
ఇక ఓన్లీ గుంటూరు కారం సినిమా మాత్రమే ఆమెకు ఏకైక చిత్రంగా ఆశలు పెట్టుకుని ఉంది.ఈ సినిమా పరాజయం ఫాలో అయితే శ్రిలీల ముందుకు వెళ్లడం కష్టం.







