బిగ్ బాస్ సీజన్ 7లో టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత.. ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 ) త్వరలో మొదలుకానుంది.బిగ్ బాస్ సీజన్5, బిగ్ బాస్ సీజన్6 ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

 Tollywood Heroine Madhavilatha Comments Goes Viral In Social Media Details ,mad-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్7కు హోస్ట్ గా వేర్వేరు పేర్లు వినిపిస్తున్నా నాగార్జున( Nagarjuna ) ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.అయితే బిగ్ బాస్ షో సీజన్7 లో తనకు ఆఫర్ వచ్చిందని అయితే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని మధవీలత చెప్పుకొచ్చారు.

వారానికి 5 నుంచి 6 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా ఈ బ్యూటీ బిగ్ బాస్ షోకు నో చెప్పినట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ ఆఫర్ గురించి మాధవీలత స్పందిస్తూ నా ఫ్యాన్స్ కు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని బిగ్ బాస్ 7 టీం నన్ను సంప్రదించిందని ఆమె అన్నారు.నాకు బిగ్ బాస్ ఆఫర్( Bigg Boss Offer ) రావడం ఇదే తొలిసారి కాదని ఏడు సీజన్లలో మూడు సీజన్లకు నాకు పిలుపు వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
అయితే నాకు వచ్చిన బిగ్ బాస్ షో ఆఫర్ ను నేనే సున్నితంగా వదులుకున్నానని మాధవీలత అన్నారు.

బిగ్ బాస్ షోకు వెళ్లాలనే ఆసక్తి నాకు ఏ మాత్రం లేదని మాధవీలత( Madhavilatha ) వెల్లడించారు.నన్ను బిగ్ బాస్ షోలో పాల్గొనాలని కోరిన బిగ్ బాస్ బృందానికి కృతజ్ఞతలు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.మాధవీలత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాధవీలత బిగ్ బాస్ షోలో పాల్గొంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మాధవీలతను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.మాధవీలత తెలుగు సినిమాలలో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube